రేషన్ బియ్యం అందని పేదల పక్షాన మానవ హక్కుల సంఘం

1477చూసినవారు
రేషన్ బియ్యం అందని పేదల పక్షాన మానవ హక్కుల సంఘం
పలమనేరు మండలం కరిడిమడుగు పంచాయతీ నలగాంపల్లి గ్రామం నందు సుమారు 70 కుటుంబాలకు ఏప్రిల్ నెల రేషన్ బియ్యం అందలేదని మానవ హక్కులు మరియు నేర నియంత్రణ బ్యూరో సభ్యులకు బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక పలమనేరు మండల తాసిల్దార్ కుప్పస్వామిని మానవ హక్కులు అధికారులు కలిసి ప్రస్తావించగా జాప్యం జరిగింది వాస్తవమేనని ఇప్పుడు మేము ఏమి చేయలేము అని చేతులు దులుపుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఫుడ్ కమిషనర్ స్పందించి ఆ నిరుపేద కుటుంబాలకు ఏప్రిల్ నెల కు సంబంధించిన రేషన్ అందించే చర్యలు తీసుకోవాలని మానవ హక్కులు మరియు నేరం నియంత్రణ బ్యూరో జిల్లా ఉపాధ్యక్షులు మాదేశ్ పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు శివశంకర్ మరియు మీడియా ఆఫీసర్ మునిరత్నం ఉన్నతాధికారులను కోరుతున్నారు. లేని పక్షాన బాధితుల తరఫున మానవ హక్కులు మరియు నేర నియంత్రణ బ్యూరో కోర్టుకు వెళైన నిరుపేదలకు న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్