అదుపుతప్పిన ప్రైవేటు స్కూల్ బస్సు

50చూసినవారు
చిత్తూరు జిల్లా వీకోట వద్ద బుధవారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. స్కూలు నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న బస్సు వీకోట సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్థానికులు హుటాహుటిన బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటికి దింపేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్