కారు ఢీకొని మహిళ స్పాట్ డెడ్, మరొకరికి గాయాలు

6249చూసినవారు
గంగవరం మండలం, మధర్ థేరిసా డిగ్రీ కాలేజ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుండి పలమనేరు వైపు వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న 4 చక్రాల తోపుడు బండిని నడుపుకుంటున్న మహిళ తులసి ని(25) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరొక వ్యక్తి దొరస్వామికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్