అసాంఘిక శక్తులపై అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు. పలమనేరు డిఎస్పీగా గురువారం బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కార్యకలాపాలు అసాంఘిక స్థితుల మీద దృష్టి సారిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా నాటుసారా నిషేధిత కుత్కాల వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వ్యాపారాలు అడ్డుకట్ట వేస్తామన్నారు. రాత్రిపూట గస్తీలను ముమ్మరం చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు.