పెద్దపంజాణి జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
పెద్దపంజాణి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది సహకారంతో ప్రభుత్వ కళాశాల అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండలంలో బీసీల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం సీఎంకు విన్నవించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్