మద్యపానం ప్రభావం సంతానంపైనా ఉంటుంది: అధ్యయనం

580చూసినవారు
మద్యపానం ప్రభావం సంతానంపైనా ఉంటుంది: అధ్యయనం
మద్యపానం వల్ల చాలా మందికి లివర్ సమస్యలు, ఇతర అనారోగ్యాలు తలెత్తుతాయి. అయితే భవిష్యత్ తరాలపైనా ఆ ప్రభావం ఉంటుందని టెక్సాస్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మద్యపానంతో DNAలో మార్పులు రానప్పటికీ బాహ్య జన్యువులలో మార్పులు వస్తాయని అధ్యయనంలో తేలింది. పిల్లలు, మనవళ్లు ఇలా తర్వాతి తరంలో వారి ఆరోగ్యం, ప్రవర్తనపై ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్