చిత్తూరు జిల్లా వీ. కోట-పెర్ణాంబట్ ఘాట్ రోడ్డులో ఓం శక్తి భక్తులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా కొట్టిందికర్ణాటక నుంచి వీ. కోట మీదుగా తమిళనాడు వెళ్తున్న బస్సు మొదటి మలుపు వద్ద బుధవారం అదుపు తప్పింది. ఈ ఘటనలో సుమారు 10 మందికి గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.