పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యావ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.