జిల్లా సీనియర్ సివిల్ జడ్జిని కలిసిన మానవ హక్కుల సంఘం

2351చూసినవారు
జిల్లా సీనియర్ సివిల్ జడ్జిని కలిసిన మానవ హక్కుల సంఘం
చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్ ని శుక్రవారం జాతీయ మానవ హక్కులు మరియు నేర నియంత్రణ బ్యూరో సభ్యులు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పుష్పగుచ్చం అందించిన సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జిల్లా ఉపాధ్యక్షులు మాదేశ్ మాట్లాడుతూ మే 13వ తేదీ జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి తమ బృందానికి అవకాశం కల్పించాలని జిల్లా న్యాయమూర్తిని కోరామని తెలిపారు. జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి అవకాశం కల్పిస్తామన్నారు. వినతి పత్రం అందించిన వారిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు శివశంకర్, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్