Oct 02, 2024, 13:10 IST/
గాలిలోకి కాలుస్తూ యువకుడి బీభత్సం (వీడియో)
Oct 02, 2024, 13:10 IST
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. రాత్రి వేళ గన్‌తో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బైక్‌పై కూర్చొని ఉండగా, మరో దుండగుడు ఇంటి బయట పిస్టల్‌తో కాల్చడం సీసీటీవీలో కనిపించింది. ఈ ఘటన సెప్టెంబర్ 24వ తేదీన జరగ్గా, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.