AP: కృష్ణా జిల్లా పోలీసులు వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి కృష్ణా జిల్లా పోలీసులు వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నమోదైన కేసులపై విచారణ జరపనున్నారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.