మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చనీయాంశంగా తిరువూరు అంశం

66చూసినవారు
మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చనీయాంశంగా తిరువూరు అంశం
AP: మంగళగిరి టీడీపీ ఆఫీసులో తిరువూరు అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెంట తిరువూరు మాజీ ఇన్‌చార్జ్ శావల దేవదత్ ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తిరువూరు పంచాయితీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని కేశినేని చిన్ని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్