TG: నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట సమీపంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు 36వ రోజు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ కాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ చర్యలు చేపట్టేందుకు సొరంగంలోకి వెళ్లాయి. ఇక ఇప్పటి వరకు ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.