AP: NTR భవన్‌లో శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు.