రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

75చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కడపకు చెందిన డొక్కా తరుణ్ కలకడ మండలం, కోనలో అఖిల్ రెడ్డి దగ్గర జెసిబి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ద్విచక్రవాహంలో వెళ్లిన తరుణ్ గురువారం స్థానిక పాపిరెడ్డి గారి పల్లి - కోన క్రాస్ మధ్యలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద శవమై ఉండడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అన్న డొక్కా శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు అన్నారు.

సంబంధిత పోస్ట్