కలికిరిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సివిల్ వర్క్స్ ను ప్రారంభించారు. ఇందులో బోర్ వెల్, క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ , ఇంటర్నల్ రోడ్స్, వాటర్ సంప్ పనులున్నాయి. బోర్ వెల్ 300 ఫీట్స్ లోనే సక్సెస్ అయిందని, తొలిసారిగా బోర్వెల్ లో నీరు పడినందుకు కేవీకే సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నీరు వచ్చిన సందర్భంగా వరి, పశుగ్రాసం మొదలగు పంటలకు సమబందించి కూడా క్షేత్ర పరిశీలనకు సన్నద్దమవుతున్నట్లు డా. కె. మంజుల వివరించారు.