పంటలకు సాగునీరు అందించే విషయాల్లో రైతుల మధ్య సమస్యలు వాటిల్లకుండా నూతన సాగునీటి సంఘాల సభ్యులు శ్రద్ధ వహించాలని పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఇటీవల ఎన్నికైన పలువురు సాగునీటి సంఘాల సభ్యులు నగిరిపల్లిలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ప్రతినిధులు బాధ్యత వ్యవహరించాలని సూచించారు.