పీలేరు పట్టణంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భార్య తనూజా రెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి కార్యాలయంలో మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు వీధిలైట్లు, రోడ్లు మరమ్మత్తులు, డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సమస్యలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని ఆమె హామీ ఇచ్చారు.