బంగారుపాలెం మండలం మొగిలి శివాలయంలో మంగళవారం మొగిలి శ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో కమలాకర్,వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్ తెలిపారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా మొగిలి శ్వర స్వామి కి అన్నాభిషేకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అన్నాభిషేకం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొగిలి శ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.