మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రాన్ని ఆదరించాలి: సినీ నటుడు

1080చూసినవారు
మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రాన్ని ఆదరించాలి: సినీ నటుడు
బడుగుల రాజ్యాధికారం నేపద్యంలో తాను నిర్మించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రాన్ని ఆదరించాలని సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. బంగారుపాలెంలో ఆదివారం రాత్రి పూతలపట్టు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీ ప్రసన్న నివాస గృహంలో విలేఖరులతో మాట్లాడారు. నవంబర్ 29వ తేదీ గానీ, డిసెంబర్ 5వ తేదీనగానీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో 10 శాతం ఉన్న అగ్ర కులస్తులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని పాలకులుగా రాణిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నిర్మిచిన ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్