చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కాగా శనివారం ఉదయం నుంచి స్వామి వారి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి వచ్చారు. అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.