ప్రమాదాల నివారణపై పోలీసుల సర్వే

1524చూసినవారు
ప్రమాదాల నివారణపై పోలీసుల సర్వే
బంగారుపాలెం మండలంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సోమవారం పోలీసులు, రవాణా శాఖ, హైవే అధికారులు సర్వే నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్ణాటక సరిహద్దు నంగిలి నుండి మండలం మొగిలి ఘాటు వరకు ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతాయి వాటి నివారణకు ఏ విధంగా చర్యలు చేపట్టాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర సర్వే చేపట్టినట్లు బంగారుపాలెం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నివేదికలను ఎస్పీ, కలెక్టర్ కు అందజేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 8వ తేదీ బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్