చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి లో వెలసి ఉండు శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. 42 రోజులకు గాను రూ.58,68,134 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి జే ఏకాంబరం గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ , బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.