చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారిపల్లి లోని శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం మాజీ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరుముడి చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి దర్శనానంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.