చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాణి మండలం గడ్డురు గ్రామానికి చెందిన నాగరాజ కుమారుడు వెంకటరమణ( 26) కుటుంబ కలహాలతో పిడదుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వెంకటరమణ ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.