రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు

82చూసినవారు
రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు
రేణిగుంట పంచాయతీ పరిధిలోని సిబిఐడి కాలనీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రేణిగుంట-పుత్తూరు పాత మార్గంలో బాలాజీ నగర్ కు చెందిన 65 ఏళ్ల ఖాసింబీ రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని యువకులు బైక్ పై ఆమెను ఢీకొట్టారు. గాయాల పాలైన ఆమెను చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్