అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగిన సంఘటన సదుం మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు బూరగమందకు చెందిన వ్యక్తులు స్వంత పనుల కోసం వచ్చి బస్టాండు వద్ద కారు నిలిపారు. కొద్ది సేపటికే ఇంజనులో నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు రేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారు నీటితో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు సమాచారం.