పుంగనూరు నియోజకవర్గం లో ఒక్కసారిగా మారిన వాతావరణం

65చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లోని మండలాలలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏడు గంటల అనంతరం ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకొని ఈదురు గాలులతో వర్షం ప్రారంభమైంది. వర్షానికి తోడుగా ఉరుములు , మెరుపులు జతకట్టడంతో వృద్ధులు , పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్