రైతులు అందరూ తప్పక ఈ పంట చేయించుకోవాలని బీఎన్. కండ్రిగ మండల వ్యవసాయ అధికారులు బుధవారం రైతులకు తెలిపారు. వారు మాట్లాడుతూ పంట బీమాను మీసేవలో చేయించుకోవాలని చెప్పారు. క్రాప్ లోన్ తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్సు ప్రీమియం బ్యాంకు వారే రైతు అకౌంట్ నుంచి జమ చేసుకుంటారని తెలిపారు. క్రాప్ లోన్ లేని రైతులు మీసేవలో క్రాప్ ఇన్సూరెన్సు కోసం ప్రీమియం కట్టాలని తెలిపారు.