తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో మంగళవారం వేకువ జామున ఒకటిన్నర గంటలకు ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వాతావరణ కేంద్రం అధికారుల హెచ్చరిక నేపథ్యంలో వర్షాలు మొదలవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండలంలో కొన్ని గ్రామాల్లో వరి పంటను ఆశించిన తెగుళ్లు ఈ వర్షం రాకతో విముక్తి పొందే అవకాశం ఉంది.