సత్యవేడు: 11నుంచి కల్యాణ వేంకన్న తెప్పోత్సవాలు

70చూసినవారు
సత్యవేడు: 11నుంచి కల్యాణ వేంకన్న తెప్పోత్సవాలు
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో వెలసిన శ్రీ పద్మావతీ సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో **కార్తిక మాస తెప్పోత్సవాలు** ఈ నెల 11 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి నాగరాజు మంగళవారం తెలిపారు. 11న శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రస్వామి, 12న ఆండాళ్ అమ్మవారు, 13, 14, 15 తేదీల్లో శ్రీ దేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి పుష్కరిణిలో తెప్పపై భక్తులను దర్శనమిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్