సురుటుపల్లిలో వైభవంగా ఆరుద్ర దర్శనం

57చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆరుద్ర దర్శన పూజలు జరిగాయి. వేకువజామున శ్రీశివగామి సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాల అనంతరం స్వామివారి గ్రామోత్సవం తమిళనాడు ఊతుకోట వరకు వైభవంగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్