కేవీబి పురం మండల ఎస్ఐగా ఓబయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న ఎస్ఐ వీరాంజనేయులు బదిలీపై వెళ్లడంతో పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్ ఇంచార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో కేవీబి పురం నూతన ఎస్ఐగా ఓబయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్ఐకి పోలీసు సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తానని ఎస్ఐ చెప్పారు.