సత్యవేడు మండలంలోని ఇరుగులంలో కబడ్డీ టోర్నమెంట్‌ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం ప్రారంభించారు. అనంతరం సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. క్రీడాకారులను బాగా ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.