వరదయ్యపాళెం: ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

61చూసినవారు
వరదయ్యపాళెం: ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరులో సత్యవేడు నియోజకవర్గ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు వాణీ అధ్యక్షత వహించారు. నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆశా వర్కర్లు రాస్తున్న రికార్డులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్