వరదయ్యపాలెం: పూరిల్లు దగ్ధం

61చూసినవారు
వరదయ్యపాలెం: పూరిల్లు దగ్ధం
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం కళత్తూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు దగ్ధమైంది. కళత్తూరు పంచాయతీ అరుంధతీవాడకాలనీకి చెందిన గూడూరు మునీంద్రయ్య మంగళవారం కూలీ పనులకు వెళ్లగా భార్య నాగులచవితి సందర్భంగా పుట్ట వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంటి కప్పుపై మంటలు ఉండటాన్ని గమనించింది. స్థానికుల సాయంతో అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.

సంబంధిత పోస్ట్