గ్రామ పంచాయతీలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు రీజినల్ స్థాయిలోని అధికారులకు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో 2 రోజులు పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని శుక్రవారం ఈటీసీ కేంద్ర ప్రిన్సిపల్ నాగ పద్మజ తెలిపారు. నాలుగు జిల్లాలు చొప్పున జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఆమె తెలిపారు.