ఏర్పేడు మండలం పాప నాయుడుపేటలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ.. స్వర్ణముఖి నది ఒడ్డున చికెన్ షాపు యజమానులు వ్యర్ధాలు వేసి కలుషితం చేస్తున్నారని చెప్పారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప మొదలి రవికుమార్, సురకాన్ శ్రీను, జఫర్ మోహన్ పాల్గొన్నారు.