కాళహస్తిలోని అరుంధతి వాడకు సర్వీసు రోడ్డు నిర్మించాలని స్థానికులు బుధవారం జాతీయ రహదారి వద్ద నిరసన తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణ శివారులోని కాగితాల అరుంధతివాడ, పూతలపట్టు నుంచి నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. 6లైన్ల రోడ్డు ఏర్పాటు చేయడంతో అరుంధతి వాడకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన తెలుపుతున్నారు. రోడ్డును కల్పించాలని కోరుతున్నారు.