రేణిగుంట రైల్వే బ్రిడ్జి కింద కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి ఇరుక్కుపోయింది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సు బైపాస్ లో వెళ్ళవలసి ఉంది. డ్రైవర్ కు రూటు తెలియకపోవడంతో రేణిగుంట పట్టణ ముఖద్వారంలోని రైల్వే బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దీంతో బ్రిడ్జి ఇరుపక్కల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేణిగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సును వెనక్కి తీసి ట్రాఫిక్ ను క్రమబద్ధకరించారు.