తుఫాన్ ప్రభావంతో కాలువలు ఎక్కడ నిండకుండా రేణిగుంట పంచాయతీ కార్యదర్శి మణి ముందస్తు చర్యలు చేపట్టారు. రేణిగుంట గ్రామపంచాయతీ పరిధి వేణుగోపాలపురం మాతమ్మ గుడి వద్ద పెద్ద కల్వర్టులో నీళ్లు నిల్వ ఉండకుండా జెసిబి సాయంతో చెత్తను తొలగించారు. పట్టణంలోని నీళ్లు వెళ్లడానికి ప్రధాన కల్వర్టు కావడంతో చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డి. పుష్ప నాదం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.