నాయుడుపేట ప్రయాణికుల ప్రాంగణ సముదాయము అధ్వాన స్థితికి చేరుకుంది. శిథిలావస్థకు చేరుకోవడంతో స్లాబ్ పెచ్చులు
ఉడిపోతున్నాయి. ఉడిన పెచ్చులు ప్రయాణికుల మీద పడుతాయన్న భయంతో ప్రయాణీకులు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. అంత ప్రమాదం వున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా స్పందించి దీనిపై చొరవ చూపి సత్వర పరిష్కారం చెయ్యాలని ప్రయాణీకులు కోరుతున్నారు.