ఆర్మేనిపాడు: మద్యం దుకాణం ఏర్పాటు పై నిరసన

73చూసినవారు
ఆర్మేనిపాడు: మద్యం దుకాణం ఏర్పాటు పై నిరసన
తమ కాలనీ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు నిరసన తెలిపారు. ఈ సంఘటన ఓజిలి మండలంలోని ఆర్మేనిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కాలనీలో షాపు ఉంటే ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ అరుణకుమారి షాపు వద్దకు చేరుకుని మహిళలతో మాట్లాడారు. ఆమె సూచనలతో షాపు యజమానులు దుకాణం తెరిచి మద్యం విక్రయించారు.

సంబంధిత పోస్ట్