ఆ విమర్శలను వెనక్కి తీసుకోవాలి

80చూసినవారు
ఆ విమర్శలను వెనక్కి తీసుకోవాలి
టీడీపీ నేత గంగా ప్రసాద్ ను వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించడం హేయమైన చర్య అని సూళ్లూరుపేట జనసేన పట్టణ అధ్యక్షుడు పొన్న కాటయ్య మండిపడ్డారు. శుక్రవారం సూళ్లూరుపేటలో ఆయన మాట్లాడుతూ తమ రాజకీయ వృత్తిని కాపాడుకునేందుకు శవ రాజకీయాలు చేయడం సత్యనారాయణ రెడ్డి మానుకోవాలన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గంగా ప్రసాద్ పై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్