బి కొత్తకోటలో వాలంటీర్ అరెస్ట్

1549చూసినవారు
బి కొత్తకోటలో వాలంటీర్ అరెస్ట్
బి. కొత్తకోటలో ఎంపీపీపై దాడికి పాల్పడ్డ వాలంటీర్ ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సూర్యనారాయణ వివరాల మేరకు మండలంలోని బుచ్చిరెడ్డిపల్లికి చెందిన వాలంటీర్ నరేశ్(32) అదే ఊరిలో ఉంటున్న బి. కొత్తకోట ఎంపీపీ లక్ష్మీనరసమ్మపై రెండు సార్లు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచాడన్నారు. ఎంపీపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాలంటీర్ ను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్