తంబళ్లపల్లి, పెద్ద మండెం మండలాల పశువుల వైద్యశాలలకు ప్రభుత్వం నుంచి వచ్చిన మందులను శనివారం పశువైద్య శాఖ అధికారులు పంపిణీ చేశారు. తంబళ్లపల్లి పశు వైద్య కేంద్రంలో ఏడి సుమిత్ర ఆధ్వర్యంలో వైద్యాధికారి సృజనశ్రీ ఆయా పశు వైద్యశాల సిబ్బందికి పంపిణీ చేశారు. పెద్ద మండెం మండలంలో 3, తంబళ్ళపల్లి మండలంలో ఏడు వైద్యశాలలకు మందులు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.