భూ సమస్యలు పరిష్కరించడానికే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తంబళ్లపల్లి టీడీపీ బాధ్యులు జయచంద్ర రెడ్డి అన్నారు. శనివారం మద్దినాయుని పల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీలు అన్నిటికీ గ్రామ సదస్సులతో చెక్ పడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రషీద్ ఖాన్, తహసిల్దార్ ప్రదీప్ పాల్గొన్నారు.