తంబళ్లపల్లి ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో పదిమంది ఎంపికైనట్లు టిఓ నాగరాజు తెలిపారు. జాబ్ మేళాలో 30 మంది అభ్యర్థులు పాల్గొన్నారని, అమరరాజా కంపెనీ ప్రతినిధులు హాజరై నైపుణ్యం కలిగిన పదిమందిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగానికి ఎన్నికైన వారికి నైపుణ్యాన్ని బట్టి జీతం ఉంటుందని వారు తెలిపారు. ఏపీ ఎస్ఎస్‌డిసి కోఆర్డినేటర్ చౌడప్ప పాల్గొన్నారు.