వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తుఫాన్ హెచ్చరికలపై అధికారులతో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. 14 నుంచి 17వరకు జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపారు. మానవ, పశు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 24X7 కంట్రోల్ రూం నంబర్ కి 08772236007 సంప్రదించాలని చెప్పారు.