తిరుపతి: రాష్ట్రంలో దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి

83చూసినవారు
తిరుపతి: రాష్ట్రంలో దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి
రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ శైలేష్ కుమార్ సింగ్ ని కలిశారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను సకాలంలో అమలు చేయడంతో పాటుగా చర్చల సమయంలో లేవనెత్తిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో దిశా సమావేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎంపీ డా. గురుమూర్తి అన్నారు.

సంబంధిత పోస్ట్